: తెలంగాణలో 17 కొత్త పరిశ్రమలకు అనుమతి మంజూరు
తెలంగాణలో నూతనంగా ఏర్పాటుచేసే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల మంజూరు మొదలైంది. తాజాగా 17 కొత్త పరిశ్రమలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతుల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ నెల 12న రాష్ట్ర నూతన పాలసీ ప్రకటించిన తరువాత 10 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం కింద పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం విశేషం. మొత్తం రూ.1,501 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో 3,317 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు కేసీఆర్ అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. అనుమతి పొందిన పరిశ్రమల వివరాలు... మెదక్ జిల్లాలో: ఐటీసీ ఆహారశుద్ధి, ప్రీమియర్ వోల్టాయిక్ విద్యుదుత్పాదక, పయనీర్ టార్ స్టీల్, సోలిత్రో ఔషధ పరిశ్రమ, కోవాలెట్ ఔషధ పరిశ్రమలు మహబూబ్ నగర్ జిల్లా: భావన సౌర విద్యుత్, ఉషాన్ వెంచర్, వాల్యూలాట్ సౌర విద్యుత్, హెచ్ఐఎల్ ప్లాస్టిక్ పరిశ్రమ, డూరాలిన్ టెలికామ్, స్నేహా పౌల్ట్రీ పరిశ్రమలు నల్గొండ జిల్లా: దొడ్ల డెయిరీ, అంజనీ పోర్ట్ లాండ్ సిమెంట్, రంగారెడ్డి జిల్లాలో నూజెన్ పొగాకు, ఈపీఆర్ ఔషధ పరిశ్రమ, ఐజెంట్ ఔషధ పరిశ్రమలు నిజామాబాద్ జిల్లా: ఎమ్మెసెస్ ఔషధ పరిశ్రమ