: బెంగళూరు వెళ్లిన చంద్రబాబు
కర్ణాటక రాజధాని బెంగళూరులో నేడు జరగనున్న స్వచ్ఛ భారత్ సమావేశానికి హాజరయ్యే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. స్వచ్ఛ భారత్ పై నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉప సంఘానికి చంద్రబాబు చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించనుండగా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.