: హిందూపురంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్న బాలయ్య!


టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి తమకు అందుబాటులో లేకుండాపోతున్నారన్న హిందూపురం వాసుల ఆరోపణలకు చెక్ పెడుతూ నేడు బాలయ్య అక్కడికి వెళుతున్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతులపై దృష్టి సారించనున్న ఆయన, అక్కడ ప్రజా దర్బార్ ను నిర్వహించనున్నారట. ప్రజా దర్బార్ లో భాగంగా ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి, సమస్యల పరిష్కారంపై బాలయ్య చర్యలు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News