: మెట్రో రైలులో అతడి చర్యకు అందరూ నివ్వెరపోయారు!
ఢిల్లీ రవాణా వ్యవస్థలో మెట్రో రైళ్లు చాలా పాప్యులర్. అయితే, ఢిల్లీ మెట్రో రైళ్లు, రైల్వే స్టేషన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోతున్నాయంటూ కొన్నాళ్లుగా ఢిల్లీ వాసులు ఎలుగెత్తుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి మెట్రో రైలెక్కి ఏంచేశాడో చూడండి. కంపార్ట్ మెంట్ లో నిలబడి మూత్రవిసర్జన చేయసాగాడు. మూసి ఉన్న గేటు వద్ద నిలుచుని మూత్రం కిందపడకుండా ఓ బాటిల్ లో పట్టసాగాడు. ఇది చూసిన సహ ప్రయాణికులు నివ్వెరపోయారు. అంతమంది మధ్యలో అతగాడి నిర్వాకానికి షాక్ కు గురయ్యారు. ఓ ప్రయాణికుడు అతడి చర్యను వీడియోగా రికార్డు చేశాడు. కాసేపటికి తేరుకున్న ప్రయాణికులు ఎందుకు ఇలా చేశారు? అని ప్రశ్నించగా, తాను వెళ్లాల్సిన ప్రదేశానికి ఇదే చివరి ట్రైన్ అని, ఇది మిస్సయితే మరో ట్రైన్ లేదని, అందుకే మూత్రం వస్తున్నా ఆపుకుని ట్రైన్ ఎక్కేశానని వివరించాడు. కాగా, ఈ ఘటనను కెమెరాలో బంధించిన వ్యక్తి వీడియోను నెట్ లో అప్ లోడ్ చేశాడు. తాను ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశానని, అయితే, వారు చర్యలేమీ తీసుకోలేదని ఆ ప్రయాణికుడు పేర్కొన్నాడు.