: భారత్ లో పెద్ద విమాన తయారీ సాధ్యమే: బోయింగ్


భారతదేశంలో పెద్ద విమానాలు తయారు చేయడం సాధ్యమేనని ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యం గల సిబ్బంది, ఇతర సౌకర్యాల ఏర్పాటుకు సమయం పట్టొచ్చేమో కానీ, భారత్ లో బోయింగ్ విమానాల తయారీ మాత్రం సాధ్యమేనని ఆ సంస్థ తెలిపింది. ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మేకిన్ ఇండియా ఎంతగానో దోహదపడుతుందని బోయింగ్ వెల్లడించింది. అంతే కాకుండా మేకిన్ ఇండియా కార్యక్రమం భారత్ కు పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకురానుందని బోయింగ్ అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News