: మోదీజీ...చేతనైతే నాలా చేయండి: కేజ్రీవాల్ సవాల్
లలిత్ మోదీ ఉదంతంలో సుష్మ స్వరాజ్, వసుంధర రాజేలపై విమర్శలు ఆగడం లేదు. ప్రతిపక్షాల విమర్శలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా జతకలిశారు. దీంతో, ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ సవాలు విసిరారు. ఢిల్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, నకిలీ సర్టిఫికేట్లు సమర్పించి మంత్రి పదవి కొట్టేశారని ఆరోపణలు రావడంతో సహచరుడు తోమర్ ను తొలగించి చిత్తశుద్ధి నిరూపించుకున్నానని, మోదీకి కూడా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్న లలిత్ మోదీకి సాయం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న, సుష్మ స్వరాజ్ ను బర్తరఫ్ చేయాలని సవాలు విసిరారు. కేవలం కేబినెట్ లో ఉన్నందునే మోదీ, సుష్మ స్వరాజ్ పై చర్యలు తీసుకోవడం లేదని, చేతనైతే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.