: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి విశిష్ట గుర్తింపు


దేశం గర్వించదగ్గ గాయకుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముందువరుసలో ఉంటారు. అనేక భాషల్లో ఆయన వేల సంఖ్యలో పాటలు పాడారు. ఇప్పటికీ ఆయన గళం గానమాధుర్యాన్ని పంచుతూనే ఉంది. ఆయన ప్రతిభను, సంగీత రంగానికి అందించిన సేవలను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ గుర్తించింది. ఈ మేరకు రికార్డు పుటల్లో ఆయనకు స్థానం కల్పించింది. సంస్థ సౌతిండియా ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్, సంస్థ తెలుగురాష్ట్రాల ఇన్ చార్జ్ స్వర్ణశ్రీ మంగళవారం ఎస్పీ బాలుకు ఓ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. దీనిపై బాలు సంతోషం వ్యక్తం చేశారు. 18 భాషల్లో దాదాపు 35 వేల పాటలు పాడిన తనను లండన్ కు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ గుర్తించడం మరువలేనన్నారు.

  • Loading...

More Telugu News