: ఆహ్వానం పంపడానికి ఇదేమన్నా రాజకీయనేత కుమార్తె వివాహమా?: ఉపరాష్ట్రపతిపై సాధ్వి ప్రాచీ మండిపాటు


వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన వీహెచ్ పీ నేత సాధ్వి ప్రాచీ మరోసారి వార్తల్లోకెక్కారు. తొలిసారి నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొనకపోవడంపై ఆమె మండిపడ్డారు. ఆయనకు ఆహ్వానం పంపడానికి ఇదేమన్నా రాజకీయనేత కుమార్తె వివాహమా? అని ప్రశ్నించారు. ఇక, యోగాను వ్యతిరేకించేవారు పాకిస్థాన్ వెళ్లిపోవాలని అన్నారు. అలాంటి వారికి దేశంలో చోటులేదని స్పష్టం చేశారు. అంతకుముందు, యోగా వేడుకలో అన్సారీ కనిపించకపోవడంపై పలు కథనాలు వచ్చాయి. అస్వస్థత కారణంగానే ఆయన రాలేదని వార్తలొచ్చాయి. అయితే, ఉప రాష్ట్రపతి కార్యాలయం దీనిపై వివరణ ఇచ్చింది. అనారోగ్యం పాలయ్యారన్న దాంట్లో నిజం లేదని, యోగా కార్యక్రమానికి ఆయనను ఎవరూ ఆహ్వానించలేదని ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News