: తూ.గో.జిల్లా అటవీ శాఖ అధికారిణిపై స్మగ్లర్ల దాడి


స్మగ్లర్ల ఆగడాలు శృతి మించాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు బీట్ అధికారిణి సుభద్రాదేవిపై స్మగ్లర్లు దాడి చేశారు. గోకవరం మండలం తూటికొండ అటవీప్రాంతంలో స్మగ్లర్లు చెట్లు నరుకుతుండగా ఆమె అడ్డుకున్నారు. దాంతో అధికారిణిపై స్మగ్లర్లు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సుభద్రాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం స్మగ్లర్లు పరారయ్యారు.

  • Loading...

More Telugu News