: సీఎంలు, స్పీకర్లు, ఈసీపై హైకోర్టులో సీపీఐ నారాయణ పిల్
సీపీఐ జాతీయ నేత నారాయణ హైకోర్టులో పిల్ వేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ఎన్నికల కమిషన్ పై పలు ఆరోపణలు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు, స్పీకర్లు, ఈసీ ల వల్లే అవినీతి పెరిగిందని అన్నారు. గత 15 ఏళ్లుగా ఎన్నికల కమిషన్ వద్ద పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటి కారణంగానే ఎన్నికల్లో అవినీతి చోటుచేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. పలు పార్టీలు చేసిన ఫిర్యాదులను స్పీకర్లు పట్టించుకోవడం లేదని, అధికారపక్షాలకు కొమ్ముకాస్తుండడం వల్లే ఫిర్యాదులు నీరుగారిపోతున్నాయని పిల్ లో ఆయన వివరించారు. సీఎంలే స్వయంగా అవినీతికి దన్ను కాస్తున్నారని ఆయన అందులో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోని పాలకపార్టీలు, స్పీకర్లు, ఈసీపై చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరిస్తే ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆయన పిల్ లో అభిప్రాయపడ్డారు.