: రాష్ట్రపతి ప్రణబ్ కు సీఎం కేసీఆర్ లేఖ... 'హరితహారం'కు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 'హరితహారం' కార్యక్రమం జులై 3న ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. హరితహారం కార్యక్రమానికి హాజరుకావాలంటూ రాష్ట్రపతిని లేఖలో ఆహ్వానించారు.