: పాలు, నీళ్లు, నూనెల విషయంలో జాగ్రత్త... దేశవ్యాప్త హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం
పాలు, నీళ్లు, వంట నూనెల వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు వచ్చే ప్యాకేజ్డ్ మిల్క్, వాటర్, ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్లలో హానికారక విషపూరితాల స్థాయి పరిమితులకు మించి ఉండవచ్చని, వీటిపై నిఘా పెట్టాలని రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లను ఆదేశించింది. దేశవ్యాప్తంగా అందరు అధికారులూ వీలైనన్ని ఎక్కువ శాంపిళ్లను సేకరించాలని, వీటి పరీక్షలను పకడ్బందీగా చేయాలని సూచించింది. రాష్ట్రాల ఆహార భద్రతా విభాగాలు మరింత జాగరూకతతో మెలగాలని సూచించామని, ముఖ్యంగా నిత్యావసరాలైన పాలు, నీటిపై మరింత నిఘా పెట్టాలని ఆదేశించామని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఒకరు తెలిపారు.