: సెక్షన్ 8తో సీమాంధ్ర నేతలు పెత్తనం చెలాయించాలనుకుంటే చెల్లదు: కోదండరాం
హైదరాబాద్ లో సెక్షన్ 8 విధిస్తారన్న ఊహాగానాలతో పలువురు టీఆర్ఎస్ నేతలు, టీజేఏసీ నేతలు మండిపడుతున్నారు. సెక్షన్ 8ను అడ్డుపెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సెక్షన్-8 పరిధి చాలా చిన్నదని, గవర్నర్ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ పై హక్కులంటే తీవ్ర ప్రతిఘటన చర్యలుంటాయని కోదండరాం పేర్కొన్నారు.