: జయలలితను పొరపాటున నిర్దోషిగా తేల్చారు: సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వం వాదన
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు పొరపాటున నిర్దోషిగా తేల్చిందని సుప్రీంకోర్టుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆమెను హైకోర్టు నిర్దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వం అప్పీల్ చేసిన నేపథ్యంలో, ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా, జయలలిత అక్రమాలకు పాల్పడ్డారని, ఆమెను దోషిగా ప్రకటించాలని సుప్రీంకోర్టుకు కర్ణాటక విన్నవించింది. మరోవైపు, కర్ణాటక హైకోర్టు తనను నిర్దోషిగా తేల్చడంతో, జయలలిత మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే.