: తొందరపాటులో నల్లజాతీయులపై 'నిగ్గర్' పదం వాడి ఇబ్బందులు కొని తెచ్చుకున్న ఒబామా


'నిగ్గర్' (nigger)... ఆరక్షరాల ఆంగ్లపదం. నల్లజాతివారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వాడే ఓ తిట్టులాంటి పదం. ఈ పదం వింటే, నల్ల జాతీయుల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. అమెరికా చరిత్రలో అధ్యక్షుడి నోటి నుంచి ఈ పదం వినపడిన దాఖలాలు లేవు. అటువంటి 'నిగ్గర్' పదాన్ని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామా పొరపాటున నోరుజారి వాడారు. అమెరికాలో జాతివిద్వేషంపై ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, సౌత్ కరోలినా చర్చిలో తొమ్మిది మంది నల్లజాతీయులను కాల్చిచంపిన ఘటనను ప్రస్తావిస్తున్న సమయంలో ఈ పదం ఆయన నోటి నుంచి వచ్చింది. "మనం దీన్ని (జాత్యహంకారాన్ని) నయం చేయలేకపోయాం. ప్రజల్లో నల్లజాతీయులు (నిగ్గర్) ఉన్నారని చెప్పడం మర్యాదనిపించుకోదు. వేధింపులు ఉన్నాయనడానికి ఇది మాత్రమే కొలమానం కాదు" అని ఆయన అన్నారు. అమెరికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడిగా ఉన్న ఒబామా, ఇలా వ్యాఖ్యానించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

  • Loading...

More Telugu News