: సిట్ రెండో రోజు విచారణ ప్రారంభం... ఎయిర్ టెల్, ఎయిర్ సెల్ ప్రతినిధుల హాజరు


ఫోన్ ట్యాపింగ్ లో కీలక సాక్ష్యాధారాల సేకరణలో నిమగ్నమైన ఏపీ సిట్ పోలీసులు రెండో రోజు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల విచారణను ప్రారంభించారు. విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కేంద్రంగా సాగుతున్న నిన్నటి తొలి రోజు విచారణకు యూనినార్, వొడాఫోన్, ఐడియా, టాటా డొకోమో, రిలయన్స్ ప్రొవైడర్లకు చెందిన ప్రతినిధులు హాజరైన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన రెండో రోజు విచారణకు ఎయిల్ టెల్, ఎయిర్ సెల్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధికారుల ఫోన్లలో మెజారిటీ శాతం ఎయిర్ టెల్ నెట్ వర్క్ లోనే ఉండటంతో నేటి విచారణలో కీలకాంశాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News