: మరో వాయుగుండం ఏర్పడే అవకాశం
వర్షాలు తగ్గడంతో, వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు తగ్గింది. అయితే, మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో, భారీ వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఖమ్మం కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. మళ్లీ వరద ముప్పు పొంచి ఉండటంతో, అధికారులంతా అందుబాటులో ఉండేందుకు సెలవులను రద్దు చేశారు.