: తెలుగు రాష్ట్రాల సీఎంలతో నేడు గవర్నర్ భేటీ... కాసేపట్లో కేసీఆర్ తో సమావేశం


గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లతో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలు, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, సెక్షన్-8 అంశంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో రాజ్ భవన్ లో సీఎం కేసీఆర్ గవర్నర్ ను కలవనున్నారు. ఇంకా గవర్నర్ తో సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. ఆయనెప్పుడు గవర్నర్ ను కలుస్తారనే విషయంపై సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News