: అవన్నీ గాలి వార్తలే... సెక్షన్ 8కు కేంద్రం సానుకూలతపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ వ్యాఖ్య
హైదరాబాదులో సెక్షన్ 8 అమలుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్న వార్తలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ గాలి వార్తలేనని ఆయన కొట్టిపారేశారు. ‘‘సెక్షన్ 8పై అటార్నీ జనరల్ నేరుగా గవర్నర్ కు సూచనలు చేస్తారని నేను అనుకోవడం లేదు. అటార్నీ జనరల్ కేవలం కేంద్రానికి మాత్రమే తన అభిప్రాయాలను తెలుపుతారు’’ అని వినోద్ నిన్న ఢిల్లీలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా హైదరాబాదులో రెండు రాష్ట్రాల పోలీసులు ఉండొచ్చనే సూచన అటార్నీ జనరల్ చేయబోరని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరచిన విధంగా ఇది కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమని చెప్పిన వినోద్, శాంతి భద్రతల అంశం కేంద్ర పరిధిలో ఉండదని అన్నారు.