: విశాఖ ‘బంగారం’ వెనుక బడాబాబులు... కూపీ లాగుతున్న డీఆర్ఐ అధికారులు


విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నిన్న పట్టుబడిన 63 కిలోల బంగారం వెనుక బడా బాబుల హస్తమున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కొంతమేర కీలక సమాచారం సేకరించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సదరు సమాచారాన్ని నిర్ధారించుకునే పనిలో పడ్డారు. బంగారంతో పట్టుబడ్డ 56 మంది స్మగ్లర్లను అధికారులు చెన్నై తరలించారు. మలేసియా, సింగపూర్, దుబాయ్ ల నుంచి వచ్చిన విమానాల్లో నుంచి దిగిన వీరి నుంచి డీఆర్ఐ అధికారులు 63 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకే రోజు ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడటంతో దీనిపై మరింత లోతుగా దృష్టి సారించిన అధికారులకు ఆశ్చర్యం గొలిపే విషయాలు బయటపడ్డాయట. మూడు విమానాల్లో పట్టుబడిన వ్యక్తులు ఒకే ముఠాకు చెందిన వారుగా తేలడంతో ఈ వ్యవహారం వెనుక బడాబాబులు ఉన్నారన్న అనుమానాలు బలపడ్డాయి. ఈ దిశగా దర్యాప్తు సాగించిన అధికారులకు పలువురు బడాబాబుల పేర్లు వినిపించాయి. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలను మరోమారు నిర్ధారించుకునేందుకు డీఆర్ఐ అధికారులు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News