: ముంబై-చెన్నై ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం
ముంబై-చెన్నై ఎక్స్ ప్రెస్ లో నిన్న రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కర్ణాటకలోని మట్మారీ ప్రాంతంలో దొంగలు రైల్లోకి చొరబడ్డారు. నేరుగా ఏసీ బోగీలోకి చొరబడ్డ దొంగలు అక్కడి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. నగదు, నగలను అపహరించారు. ఆ తర్వాత తాపీగా రైలు దిగి పారిపోయారు. దోపిడీ దొంగల బీభత్సంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణికులు కర్నూలు జిల్లా తుంగభద్ర రైల్వే స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న రైల్వే పోలీసులు దోపిడీ దొంగల కోసం గాలింపు చేపట్టారు.