: వియ్యంకుడి కేసు విషయంలో రజనీకాంత్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు!


ఆర్థిక వ్యవహారాల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబానికి కోర్టు నోటీసుల పరంపర కొనసాగుతోంది. తీసుకున్న రుణం తీర్చడం లేదంటూ పలువురు రుణదాతలు ఇప్పటికే రజనీ సతీమణికి పలుమార్లు కోర్టు నోటీసులు ఇఫ్పించారు. తాజాగా రజనీకాంత్ కే మద్రాస్ హైకోర్టు నిన్న నోటీసులు జారీ చేసింది. రజనీకాంత్ వియ్యంకుడు (హీరో ధనుష్ తండ్రి) కస్తూరి రాజా 2012లో ‘మైహూ రజనీకాంత్’ హిందీ చిత్ర నిర్మాణం కోసం ముకుంద్ బోత్రా వద్ద రూ.40 లక్షలు అప్పుగా తీసుకున్నారట. తర్వాత మరో రూ.25 లక్షలు అడిగిన కస్తూరి రాజా, సదరు అప్పు తాను తీర్చలేని పక్షంలో తన వియ్యంకుడు రజనీకాంత్ తీరుస్తారని చెప్పారట. ఈ వ్యవహారంలో కస్తూరి రాజా ఇచ్చిన చెక్కులు చెల్లలేదని ముకుంద్ బోత్రా హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... కస్తూరి రాజాతో పాటు రజనీకాంత్ కు కూడా నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News