: ఆ రోజున ఫాదర్స్ డే అయినా... యోగా గురించే ఎక్కువగా వెదికారట!


ప్రధాని మోదీ చొరవతో పురాతన విద్య యోగాకు రాజయోగం పట్టింది. మోదీ విజ్ఞప్తికి ఓకే చెప్పిన ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించింది. ఈ క్రమంలో నిన్న (ఆదివారం) భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇక, జూన్ 21న 'ఫాదర్స్ డే' కూడా జరుపుకున్నారు. అయితే, ఆ రోజున 'ఫాదర్స్ డే' కంటే ఎక్కువగా యోగా గురించే గూగుల్ లో వెదికారట నెటిజన్లు. రెండు లక్షల మందికి పైగా యోగా గురించి సెర్చ్ చేశారట. ముఖ్యంగా, 'యోగా', 'యోగా డే' సెర్చ్ టర్మ్ లతో నెటిజన్లు దున్నేసినట్టు గూగుల్ పేర్కొంది. సోషల్ మీడియాలోనూ ఇదే ట్రెండ్ నడిచిందట.

  • Loading...

More Telugu News