: బ్లాక్ బర్గర్ కి దీటుగా రెడ్ బర్గర్


ప్రతి ఏటా భోజన ప్రియులకు రుచికరమైన కొత్త బర్గర్ ను పరిచయం చేసే జపాన్ రెస్టారెంట్ 'బర్గర్ కింగ్' ఈ ఏడాది కూడా కొత్త బర్గర్ ను రుచి చూపించింది. ఇప్పటికే భోజన ప్రియులను ఆకట్టుకుంటున్న బ్లాక్ బర్గర్ కు దీటుగా రెడ్ బర్గర్ ను తయారు చేసినట్టు తెలిపింది. రెడ్ బర్గర్ జూలై 3 నుంచి అందుబాటులోకి రానుందని బర్గర్ కింగ్ వెల్లడించింది. టామాటా, రెడ్ చీజ్ నుంచి తయారు చేయడం వల్లే రెడ్ కలర్ వచ్చిందని బర్గర్ కింగ్ తెలిపింది. దీనిని మాంసాహార, శాకాహార రుచుల్లో భోజన ప్రియులకు అందించనున్నామని బర్గర్ కింగ్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News