: రానా! ఈ సినిమాలో నేను కూడా ఉండాల్సింది!: అమితాబ్ బచ్చన్


"రానా! ఇప్పుడనిపిస్తోంది, ఈ సినిమాలో నేను కూడా ఉండాల్సింది" అని భారతీయ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తన కోరికను వెలిబుచ్చారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'బాహుబలి' సినిమా గురించి రానాతో అమితాబ్ వీడియో చాట్ చేశారు. ఈ చాట్ లో అమితాబ్ 'బాహుబలి'పై ఆసక్తి వ్యక్తం చేశారు. 'సినిమా సెట్ లు ఎక్కడ వేశారు? హైదరాబాదులోనేనా?' అని అడిగారు. ఇంత పెద్ద సినిమాలు హాలీవుడ్ లోనే నిర్మితమవుతాయని అంతా భావించేవారని, భారత్ లో కూడా ఇలాంటి సినిమా నిర్మించి, ఇండియన్ సినిమా సత్తా చాటుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినీ పరిశ్రమలో తాను కూడా ఉండడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాజమౌళి, సినిమాలో నటించిన నటీనటులు, సినిమాకి పని చేసిన టెక్నీషియన్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News