: భారతీయ యాత్రికుల సౌకర్యం కోసం దారి తెరిచిన చైనా
టిబెట్ లో భారతీయులకు ప్రీతిపాత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిని దర్శించేందుకు భారతీయులు ఆసక్తి చూపుతారు. కానీ, చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా ప్రతి ఏటా పరిమిత సంఖ్యలో మాత్రమే యాత్రికులు టిబెట్ లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. అయితే, గతేడాది చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ లో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ భారతీయ యాత్రికుల సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో కొత్త మార్గం తెరిచేందుకు చైనా అంగీకరించింది. దీంతో మౌంట్ కైలాష్ యాత్రకు భారతీయ బృందం తొలిసారి కొత్త మార్గం ద్వారా ప్రవేశించింది.