: వివాదం రేపి... ఆనక వివాదం వద్దంటున్న బీజేపీ నేత
'అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొన్నారు. మరి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఎందుకు పాల్గొనలేదు?' అంటూ ట్వీట్ తో ప్రశ్నించి, వివాదం రేపిన బీజేపీ నేత రామ్ మాధవ్ ఇప్పుడు తనే మళ్లీ 'వివాదం చేయవద్దని, ఇంతటితో వివాదానికి ముగింపు పలకాలని' విజ్ఞప్తి చేశారు. ఆయన ట్వీట్ చేయగానే ఉపరాష్ట్రపతిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే రామ్ మాధవ్ ట్వీట్ పై స్పందించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం, ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతిని ఆహ్వానించాలని, ఆహ్వానం లేకపోతే ఆయన ఏ కార్యక్రమంలో పాల్గోరని, అలాగే యోగా డే సందర్భంగా ఆయనను ఎవరూ ఆహ్వానించలేదని స్పష్టం చేసింది. దీంతో విషయం అవగతమైన రామ్ మాధవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంతా యోగా డేగా గుర్తుంచుకోవాలని, ఇంతటితో వివాదానికి ముగింపు పలకాలని సూచించారు.