: దేశ పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు సాఫ్ట్ బ్యాంక్ ఆసక్తి


'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ మేజర్ సాఫ్ట్ బ్యాంక్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఢిల్లీలో సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్, సీఈవో మసాయోషీ సన్ ఈ రోజు కలిశారు. ఆయనతో పాటు భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, జపాన్ బ్యాంక్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎండీ కూడా ప్రధానిని కలసిన వారిలో ఉన్నారు. "మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలోని ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తి వ్యక్తం చేశారు" అని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

  • Loading...

More Telugu News