: ప్రధాని మోదీని కీర్తించిన మంత్రి వెంకయ్యనాయుడు


ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధానిని ప్రశంసించారు. జూన్ 21న భారత్ ను ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మార్చేశారని పేర్కొన్నారు. "మోదీ చాలా గొప్పవారు. భారత్ ను ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మార్చారు. 192 దేశాలు, 193 యూఎన్ సభ్యులు యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు" అని వెంకయ్య ట్వీట్ చేశారు. ప్రధాని నిజంగా గొప్పవారని, 'నీతి అయోగ్' నుంచి 'స్వచ్ఛ భారత్', 'బేటీ పడావ్, బేటీ బచావ్', 'అటల్ మిషన్ ఫర్ అర్బన్ రెన్వ్యుల్ అంట్ ట్రాన్స్ ఫార్మేషన్' నుంచి యోగా వరకు ప్రతి కోణంలోనూ దేశాన్ని మార్చేస్తున్నారని అభినందించారు. ఇదే సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా వెంకయ్య ప్రశంసించారు. "రాష్ట్రపతి భవన్ లో యోగా దినోత్సవం నిర్వహించి, జాతికి మార్గనిర్దేశం చేసిన రాష్ట్రపతి ప్రజల అధ్యక్షుడని మరోసారి నిరూపించారు" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News