: వసుంధరా రాజేపై ఆరోపణలు నిరాధారం: నితిన్ గడ్కరీ


రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆమెకు మద్దతుగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు జైపూర్ లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ, "రాజస్థాన్ సీఎంపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారం. కేంద్రం, బీజేపీ ఆమెకు అండగా ఉంటాయని హామీ ఇచ్చాను" అని తెలిపారు. లలిత్ మోదీ కంపెనీ నుంచి వసుంధర కుమారుడు దుష్యంత్ సింగ్ కంపెనీకి నగదు లావాదేవీ జరిగినట్టు వస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. "ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ లో అన్ని లావాదేవీలు రికార్డ్ అవుతాయి. ఒకరి నుంచి నగదును అప్పుగా తీసుకోవడం నేరం కాదు" అని మంత్రి పేర్కొన్నారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వసుంధర సహకరించారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గడ్కరీ ఈరోజు ఆమెతో సమావేశమై ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News