: ఏపీ సిట్ విచారణకు హాజరైన వొడాఫోన్, యూనినార్ ప్రతినిధులు
ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ వేగవంతమైంది. ఈరోజు విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో చిత్తూరు ఎస్పీ రామకృష్ణ నేతృత్వంలోని సిట్ బృందం విచారణ చేస్తోంది. ఈ విచారణలో వొడాఫోన్, యూనినార్ ప్రతినిధులు పాల్గొన్నారు. యూనినార్ ప్రతినిధులు సిట్ బృందానికి ట్యాపింగ్ కు సంబంధించిన వివరాలు సమర్పించారు. విచారణ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి మీడియాను కూడా రానివ్వడం లేదు.