: తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి: హర్షకుమార్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ ప్రయత్నించడం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అటు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ల సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని రాజమండ్రిలో మీడియాతో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.