: వెంకయ్య ప్రసంగిస్తుండగా ఎస్వీయూ విద్యార్థుల ఆందోళన


తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తొలుత వెంకయ్య పలువురు విద్యార్థులకు పట్టాలు అందించారు. అనంతరం, ఆయన ప్రసంగించేందుకు సిద్ధం కావడంతో... కొంతమంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ఆందోళనకు దిగారు. ఆ సమయంలో వేదికపై గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. అక్కడ పరిస్థితులు అదుపు తప్పుతున్నట్టు భావించిన పోలీసులు... ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News