: బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ సినిమాపై ఫిర్యాదు


బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేదీలపై వారణాసిలోని భేలుపుర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. సదరు దర్శకుడు రూపొందించిన 'మోహల్లా అస్సీ' చిత్రంలో సన్నీ నటించారు. ఈ సినిమా మత భావాలను దెబ్బతీసిందని, అటువంటి చిత్రం విడుదలయ్యేందుకు తాము అంగీకరించమంటూ 'సర్వజన్ జాగృతి సంస్థ' తమ ఫిర్యాదులో పేర్కొంది. నైతిక విలువలను ఉల్లంఘించడమేగాక, వారణాసి స్థాయిని తక్కువ చేసి చూపారంటూ ఆ సంస్థ పేర్కొంది. 'కాశీ కా అస్సీ' అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News