: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఉపరాష్ట్రపతిని ఆహ్వానించలేదట!
'అంతర్జాతీయ యోగా దినోత్సవం'ను నిన్న (ఈ నెల 21) ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాజ్ పథ్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారీగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ హాజరుకాకపోవడంపై బీజేపీ సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ నేత రాం మాధవ్ వాకబు చేశారు. తరువాత ఆయన అస్వస్థతతో ఉన్నారని తెలసిందంటూ మాధవ్ క్షమాపణలు చెప్పారు. ఇందుకు ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందిస్తూ, అన్సారీని ఆహ్వానించలేదని తెలిపింది. "ఉపరాష్ట్రపతి అస్వస్థతకు లోనుకాలేదు. యోగా కార్యక్రమానికి అసలు ఆహ్వానమే అందలేదు" అని స్పష్టం చేసింది. అయితే ప్రొటోకాల్ ప్రకారం సదరు మంత్రిత్వశాఖ ఆహ్వానిస్తేనే ఉపరాష్ట్రపతి హాజరవుతారని కార్యాలయం పేర్కొంది.