: అమెరికా అధ్యక్షుడిపై మంత్రిగారి భార్య జోక్!... ఆనక క్షమాపణలు
ఓ దేశాధ్యక్షుడిని విమర్శించడమంటే మాటలు కాదు. అలాంటిది అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ఓ మంత్రిగారి సతీమణి ట్విట్టర్ లో ఏకంగా హాస్యంతో కూడిన వ్యాఖ్యలు పోస్ట్ చేసింది. ఈ చర్యను అందరూ ఖండించడంతో వెంటనే క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారు కదా? ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మంత్రివర్గంలో సిల్వాన్ షాలోమ్ మంత్రిగా ఉన్నారు. ఆయన భార్య జూడీ షాలోమ్. ఆవిడే ట్విట్టర్ లో " 'ఒబామా కాఫీ' అంటే ఏంటో తెలుసా? అది బ్లాక్ అండ్ వీక్ అని" అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ట్వీట్ చేసి ఇరుక్కుపోయింది. పలువురు ఆమెపై మండిపడటం, రివర్స్ వ్యాఖ్యలు చేయడంతో వెంటనే తన మాటలను తొలగిస్తున్నట్టు తెలిపింది. ఏ ఒక్క జాతినో, మతాన్నో కించపరుస్తూ తాను ఆ ట్వీట్ చేయలేదని జూడీ వివరణ ఇచ్చింది.