: మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్?
ఓటుకు నోటు కేసులో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తదనంతరం చంద్రబాబు మాట్లాడినవిగా భావిస్తున్న ఆడియో టేపులు లీక్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కేసులు, అరెస్టులు, నోటీసులు తదితరాలతో ఇరు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. ఆడియో, వీడియో టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లాయి. ఆ తర్వాత, ఈ కేసు మెల్లగా చల్లబడింది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వస్తే గానీ కేసు ముందుకు కదిలేలా లేదు. ఈ నేపథ్యంలో, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రెడీ అవుతోందని, మరో రెండు రోజుల్లో నివేదికను అందజేస్తారనే వార్తలు వినపడుతున్నాయి.