: శరణాగతి చేస్తే అంతా చూసుకుంటానన్నాడు: తిరుమలలో గవర్నర్


తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను తీరుస్తానని తిరుమల వెంకటేశ్వరస్వామి చెప్పాడని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. నిన్న సాయంత్రం తిరుమలలో సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు ఏడుకొండల వాడిని దర్శించుకునే సమయంలో ‘నన్ను శరణాగతి చేస్తే నేను చూసుకుంటా’ అని స్వామివారు చెప్పినట్లు నా మనసులో అనిపించింది. రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించి, ప్రజలు సుఖంగా జీవించేలా ఆశీర్వదిస్తానని కూడా స్వామివారు చెప్పారు. అందుకే ఎలాంటి కష్టాలొచ్చినా ఆపద్బాంధవుడు శ్రీవేంకటేశ్వరుడి దీవెనలతో తొలగిపోతాయి. ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతున్నా’’ అని నరసింహన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News