: ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ సిట్ దర్యాప్తు ముమ్మరం...బెజవాడలో విచారణకు 12 మంది టెలికాం ఆపరేటర్లు


ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ సర్కారు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ తో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియో టేపులను ప్రసారం చేసిన టీ న్యూస్, సాక్షి వార్తా చానెళ్లకు విశాఖ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ పై పక్కా సమాచారం రాబట్టేందుకు సిట్ రంగంలోకి దిగింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి విచారణకు హాజరుకావాలని 12 టెలికాం సంస్థలకు సిట్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న టెలికాం సంస్థల ప్రతినిధులు నేడు విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో జరగనున్న విచారణకు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News