: ఈ ఆసుపత్రి చాలా ప్రత్యేకమైనది!


అత్యాచారం ఓ అమానవీయ చర్య! భౌతికంగా, సామాజికంగా మహిళలను కుంగదీసే ఈ కిరాతకాలు ఇంకా ఎన్నాళ్లని ఆయా దేశాల్లో ప్రజాసంఘాలు ఎలుగెత్తి ప్రశ్నిస్తుండడం తెలిసిందే. అయితే, అత్యాచారాలు మహిళలపైనే కాదు, పురుషులపైనా జరుగుతాయని తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతాం. ఇక, రేప్ కు గురైన మగవారి కోసం ఓ ప్రత్యేకమైన ఆసుపత్రి ఉందంటే అంతకంటే ఎక్కువగా విస్మయం చెందుతాం. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో సౌత్ జనరల్ హాస్పిటల్ పేరిట సరికొత్త చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ జనరల్ ఫిజీషియన్లే కాదు, సైకియాట్రిస్టులూ అందుబాటులో ఉంటారు. ఎందుకంటే, రేప్ కు గురైన పురుషులు షాక్ తింటే వారిని మామూలు స్థితికి తీసుకురావాల్సింది మానసిక వైద్య నిపుణులే కదా! స్వీడన్ లో గత సంవత్సరం మగవారిపై 370కి పైగా రేప్ కేసులు నమోదయ్యాయి. అత్యాచారానికి గురైన వారిలో అన్ని వయసుల వాళ్లూ ఉన్నారు. మహిళల్లాగే చాలామంది పురుషులు కూడా తమపై జరిగిన దారుణాన్ని బయటికి చెప్పుకోలేరని ఇక్కడి వైద్యులు అంటున్నారు. రేప్ కు గురైన వ్యక్తులకు 24 గంటల పాటు ప్రత్యేక చికిత్స అవసరమని, అందుకే ఈ స్పెషల్ హాస్పిటల్ అని అన్నారు. ఇక, అగ్రరాజ్యం అమెరికాలోనూ పురుషులపై అఘాయిత్యాలు 10 శాతం ఎక్కువైనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు పలు ప్రపంచ దేశాలు సైతం స్వీడన్ బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నాయట.

  • Loading...

More Telugu News