: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ శశిబాల దుర్మరణం
భారత హాకీ వర్గాల్లో విషాదం అలముకుంది. భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ శశిబాల దుర్మరణం చెందారు. పంజాబ్ లోని నవాన్ షహర్ జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. శశిబాల ప్రయాణిస్తున్న కారును ఓ భారీ వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శశిబాలతో పాటు ఆమె కుమారుడు, కారు డ్రైవర్ కూడా ప్రాణాలు విడిచారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.