: ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడూ ఊహించలేదు: యోగా దినోత్సవంపై బాన్ కీ మూన్ స్పందన


వరల్డ్ యోగా డే (జూన్ 21) సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్పందన వెలిబుచ్చారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. 192 దేశాల్లో 200 కోట్ల మంది యోగా దినోత్సవాన్ని నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. ఇదంతా భారత్ గొప్పదనమేనని అభినందించారు. భారత్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఐరాసలో నిర్వహించే యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' గురు రవిశంకర్ అమెరికా వెళ్లారు. న్యూయార్క్ లో వారు బాన్ కీ మూన్ ను కలిశారు. ఈ సందర్భంగానే మూన్ తన స్పందన తెలియజేశారు.

  • Loading...

More Telugu News