: లలిత్ మోదీ బ్రిటన్ రాజకుటుంబాన్ని కూడా వదల్లేదు
వీసా వ్యవహారంతో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే లను వివాదంలోకి లాగిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ బ్రిటన్ రాజకుటుంబాన్ని కూడా వదల్లేదు. లలిత్ మోదీ బ్రిటన్ రాజు ఛార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూ పేర్లు వాడుకుని యూకే హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు పొందాడని 'ద సండే టైమ్స్' పేర్కొంది. ట్రావెల్ డాక్యుమెంట్స్ పొందడానికి కొద్ది కాలం ముందు ఆండ్రూను లలిత్ మోదీ కలిశాడని 'ద సండే టైమ్స్' కథనంలో పేర్కొంది. ఆ పరిచయాన్ని ట్రావెల్ డాక్యుమెంట్లు పొందడానికి ఆయన వాడుకున్నాడని కథనం వెల్లడించింది.