: ఫోర్త్ లయన్ యాప్ ప్రారంభించిన బాబు
'ఫోర్త్ లయన్' యాప్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ యాప్ ను ప్రారంభించారు. 'ఫోర్త్ లయన్' యాప్ ద్వారా విజయవాడ పోలీసులు వివిధ సేవలను నగర పౌరులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, 'ఫోర్త్ లయన్' యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ వ్యవహరించనున్నారు. 'పోలీస్ స్టోరీ' సినిమాలోని నటన ద్వారా సాయికుమార్ అభిమానులకు మరింత చేరువైన సంగతి తెలిసిందే.