: ఒత్తిడిని దూరం చేసుకునేందుకు యోగా ఒక మంచి మార్గం: గవర్నర్


మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు యోగా ఒక మంచి మార్గమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవలే తాను యోగాసనాలు వేయడం ప్రారంభించానని చెప్పారు. జీవనవిధానంలో సమతుల్యత సాధించేందుకు యోగా దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. యోగాను జీవితంలో ఓ భాగంగా అలవాటు చేసుకుంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, అందుకే అందరూ యోగాను ఆచరించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News