: సోషల్ మీడియాలో కాకపుట్టిస్తున్న 'జురాసిక్ వరల్డ్-4'


ఈ మధ్యే విడుదలై ప్రపంచ సినీ అభిమానులను అలరిస్తున్న స్టీవెన్ స్పిల్ బర్గ్ సినిమా 'జురాసిక్ వరల్డ్-4'పై పాకిస్థానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ డైనోసార్ ను 'పాకీస్' అని పిలుస్తారు. పాకిస్థానీలపై ద్వేషంతోనే అలా పిలిచారని సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానిస్తుండగా, హాలీవుడ్ కు పాకిస్థాన్ ను విమర్శించాల్సిన అవసరం ఏంటని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే 'పాకీస్' అనే డైనోసార్ జాతి ఒకటి ఉండేది. 2006లో పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ లో పురాజీవ శాస్త్రవేత్త ఎంఎస్ మల్కానీకి ఓ డైనోసార్ శిలాజాలు కనిపించాయి. వీటికి ఆయన 'పాకిసారస్' అని పేరు పెట్టి, దాని శాస్త్రీయ నామం 'పాకిసారస్ బలోచిస్థాన్' అని ఖరారు చేశారు. దీంతో 'జురాసిక్ వరల్డ్-4'లో ఆ జాతి డైనోసార్ ను 'పాకీస్' అని పిలిచారని ఒక వర్గం పేర్కొనగా, ఉత్తర అమెరికాలోని డైనోసార్ ను 'పాకీస్' అని ఎలా పిలుస్తారని మరో వర్గం ఎదురు ప్రశ్నిస్తోంది. మొత్తానికి 'జురాసిక్ వరల్డ్-4' సినిమా సోషల్ మీడియాలో కాకపుట్టిస్తోంది.

  • Loading...

More Telugu News