: తండ్రి మరణ ధ్రువీకరణ పత్రాన్ని అడిగిన లాడెన్ తనయుడు!


సంచలన విషయాలు వెల్లడించడంలో అందెవేసిన వికీలీక్స్ మరో విషయం ప్రపంచానికి వెల్లడించింది. ఆల్ ఖైదా అగ్రనేత ఒసామాబిన్ లాడెన్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆయన కుమారుడు అమెరికాను అడిగాడట. అతని అభ్యర్ధనను అమెరికా తిరస్కరించిందని వికీలీక్స్ వెల్లడించింది. సౌదీ అరేబియాకు చెందిన 70 వేల డాక్యుమెంట్లలో లాడెన్ కుమారుడు అబ్దుల్లా తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కావాలని కోరుతూ రియాద్ లోని అమెరికా దౌత్య కార్యాలయానికి రాసిన లేఖ ఉందని వికీలీక్స్ తెలిపింది. అయితే, అది ఇవ్వలేమని అమెరికా స్పష్టం చేసినట్టు ఉందని వికీలీక్స్ వెల్లడించింది. ఇదిలా వుండగా, అమెరికా న్యాయస్థానం లాడెన్ మరణ ధ్రువీకరణకు సంబంధించిన కొన్ని పత్రాలను రియాద్ లోని అమెరికా దౌత్యకార్యాలయానికి పంపినట్టు వికీలీక్స్ తెలిపింది.

  • Loading...

More Telugu News