: రాహుల్ గాంధీ గొప్పమనసు చాటుకున్నారు


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నిరాడంబరతకు పెద్దపీట వేసే రాహుల్ గాంధీ పేదల పట్ల అంతులేని ప్రేమాభిమానాలు కురిపిస్తారు. రాహుల్ పర్యటనల్లో సెక్యూరిటీ హడావుడి ఉన్నప్పటికీ ఆయన ప్రజలతో మమేకమవ్వడమే ఎక్కువగా కనబడుతుంది. రైతులు, దళితులు, నిరుపేదల ఇళ్లలో ప్రవేశించినప్పుడు నేల మీద కూర్చునేందుకు, వారు అందించే ఆహారం తీసుకోవడానికి ఏమాత్రం సంకోచించరు. అలాంటి రాహుల్ ఇప్పుడు ప్రతిభావంతులైన ఇద్దరు నిరుపేదలకు ఆపన్నహస్తం అందించారు. ఐఐటీలో 167, 410 ర్యాంకులు సాధించిన రాజు, బ్రిజేష్ లను చదివించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. ఉత్తరాఖండ్, ప్రతాప్ గఢ్ జిల్లాలోని రెహువాలాల్ గంజ్ గ్రామానికి చెందిన రాజు, బ్రిజేష్ ల తండ్రి ధర్మరాజ్ రోజు కూలీ కావడంతో వారి అడ్మిషన్ ఫీజు లక్ష రూపాయలు కట్టడం అన్నది తలకు మించిన భారం అయింది. దీనిని మీడియా ప్రసారం చేయడంతో రాహుల్ గాంధీ వారికి ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. దీంతో వారు ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. దీంతో వారి అడ్మిషన్ ఫీజు సమస్య తీరింది. వారిద్దరికీ రాహుల్ ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పారు. బాగా చదువుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News