: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై రకరకాలుగా నిప్పులు చెరుగుతున్న ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, బొగ్గు స్కాంపై నిలదీసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సంచలనం సృష్టిస్తున్న కోల్ అంశంపై చర్చ చేపట్టాలని సభలో నోటీసు ఇచ్చామని ఆ పార్టీనేత ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. 2జీ, బొగ్గు కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వాన్నినిలదీస్తామన్నారు. అటు, ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఉక్కు కర్మగారం ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు లోక్ సభ స్పీకర్ కు సావధానతీర్మానం ఇచ్చారు.