: స్మగ్లర్ గంగిరెడ్డి అనుచరుడు శివశంకర్ అరెస్టు
కడపలో 8 మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో స్మగ్లర్ గంగిరెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.8 కోట్ల విలువైన 4 టన్నుల ఎర్రచందనం, ఐదు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు కడప, కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలం నుంచి ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు స్మగ్లర్లపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు.